Sunday, October 5, 2025
E-PAPER
Homeఆటలుదాయాదుల ధనాధన్‌

దాయాదుల ధనాధన్‌

- Advertisement -

భారత్‌, పాకిస్తాన్‌ పోరు నేడు
రాత్రి 8 నుంచి సోనీస్పోర్ట్స్‌లో..
ఏసీసీ ఆసియా కప్‌ 2025

నవతెలంగాణ-దుబాయ్
2025 ఆసియా కప్‌లో టీమ్‌ ఇండియా గ్రూప్‌ దశలో రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. గ్రూప్‌-ఏలో తొలి మ్యాచ్‌లో యుఏఈని చిత్తు చేసిన సూర్యకుమార్‌ సేన.. నేడు పొరుగు దేశం పాకిస్తాన్‌తో ఢీకొీట్టనుంది. 2023 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై అత్యంత ఏకపక్ష విజయం నమోదు చేసిన భారత్‌ నేడూ అదే ఫలితం పునరావృతం చేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ.. పాక్‌ నుంచి బాబర్‌, రిజ్వాన్‌లు లేకపోవటంతో దాయాదుల ధనాధన్‌కు అభిమానుల్లో ఆసక్తి తగ్గింది!. దుబాయ్ లో నేడు రాత్రి 8 గంటలకు భారత్‌, పాక్‌ ఆరంభం.

ఎదురుందా? :
యుఏఈపై ఏకపక్ష విజయం సాధించిన భారత్‌ నేడు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్‌ సైతం తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఉత్సాహంలో ఉంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ త్రయాన్ని ఎదుర్కొవటం పాకిస్తాన్‌కు కఠిన సవాల్‌గా నిలువనుంది. జశ్‌ప్రీత్‌ బుమ్రాకు తోడుగా హార్దిక్‌ పటేల్‌ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఆల్‌రౌండర్‌ శివం దూబె మరోసారి తుది జట్టులో నిలువనున్నాడు. బ్యాటింగ్‌ లైనప్‌కు తొలి మ్యాచ్‌లో సవాలే లేదు. అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ జోడీ లాంఛనం ముగించారు. నేడు అభిషేక్‌, శుభ్‌మన్‌తో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌లు బ్యాట్‌తో పరీక్షకు సిద్ధం కానున్నారు. శివం దూబె, హార్దిక్‌, అక్షర్‌ పటేల్‌ రూపంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు భారత బ్యాటింగ్‌ లోతును మరింత బలోపేతం చేశారు.
పాకిస్తాన్‌ నుంచి షహీన్‌ షా అఫ్రిది, సుఫియన్‌లు బౌలింగ్‌ విభాగంలో.. మహ్మద్‌ హారిస్‌, ఫకర్‌ జమాన్‌, సల్మాన్‌ ఆగాలు బ్యాటింగ్‌ విభాగంలో కీలకం కానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -