Tuesday, December 2, 2025
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్‌లో కోవాసెంట్‌ కొత్త సెంటర్‌

హైదరాబాద్‌లో కోవాసెంట్‌ కొత్త సెంటర్‌

- Advertisement -

ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ – హైదరాబాద్‌

కోవాసెంట్‌ టెక్నాల జీస్‌ హైదరాబాద్‌లోని ఆత్రియా, ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్క్‌లో తన కొత్త ఏఐ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించింది. డల్లాస్‌, న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌, లండన్‌, దుబాయిలో ఉన్న గ్లోబల్‌ కార్యాలయాలతో పాటు ఈ కొత్త సెంటర్‌ ఏజెంటిక్‌ ఏఐ స్వీకరణకు ప్రత్యేకంగా అంకితమైందని ఆ కంపెనీ పేర్కొంది. ఈ సెంటర్‌ను సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్‌ బాబు లాంచనంగా ప్రారంభించారు. దీనికి ఐటి సేవల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్‌, ఐటీ సలహాదారు సాయి కృష్ణ హాజరయ్యారు. ”ప్రపంచవ్యాప్తంగా నగరాలు కృత్రిమ మేధస్సు యుగాన్ని నడిపేందుకు పోటీ పడుతున్నాయి. హైదరాబాద్‌ మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. మేము సామర్థ్యం, దీర్ఘకాల దృష్టిపై ఆధారపడి నాయకత్వాన్ని నిర్మిస్తున్నాము.” అని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ”ఏజెంటిక్‌ ఏఐ శక్తివంతమైన సామర్థ్యంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను సృష్టించడం ద్వారా, మా కస్టమర్‌లకు ఏఐ ఏజెంట్లను అన్వేషించేందుకు, ప్రయోగాల నుంచి వ్యాపార ప్రభావం వైపు ప్రయాణించేందుకు, ఎంటర్‌ప్రైజ్‌ గార్డ్‌రైల్స్‌తో స్కేల్‌కు నిర్మించేందుకు ఒక భద్రమైన వాతావరణాన్ని అందిస్తున్నాము.” అని కోవాసెంట్‌ సీఎండీ సివి సుబ్రమణ్యం అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -