Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ఇంటింటికి గోమాత

ఇంటింటికి గోమాత

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలం లోని 1వ వార్డులో ఉన్న జాతీయ రహదారి పక్కన ఉండే వ్యాపార దుకాణాలు మరియు ఇళ్ల దగ్గరకు ప్రతిరోజు ఒక ఆవు వెళ్తుంది. ఆ ఆవుని అక్కడి వ్యాపారస్తులు, గృహ యజమానులు ఎంతో ఆదరిస్తారు. ప్రతిరోజు ఆ ఆవుకి నూకలు, బియ్యం, పల్లి పిండి, బెల్లం, అరటి పండ్ల వంటి వాటిని ఆహారంగా అందిస్తున్నారని తెలిపారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆ ఆవుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆవుకు పసుపు, కుంకుమలతో అలంకరించి, పూలమాలలు వేసి, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. సకల దేవతలను తనలో ఇముడ్చుకున్న గోమాతగా భావించి అందరూ ఆవుకు ప్రత్యేకంగా నమస్కరించారు. ఈ సంఘటన ఆ ప్రాంత ప్రజలకు ఆవు పట్ల ఉన్న గౌరవాన్ని, భక్తిని తెలియజేస్తుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img