Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారత గడ్డపై సీపీఐకి 100 ఏండ్లు పూర్తి 

భారత గడ్డపై సీపీఐకి 100 ఏండ్లు పూర్తి 

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల అఖిలభారత స్థాయి ముగింపు ఉత్సవాలు జనవరి 18న 2026 ఖమ్మంలో లక్షలాదిమందితో సిపిఐ పార్టీ బహిరంగ సభ  నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో బహిరంగసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బహిరంగ సభకు 40 ప్రపంచ దేశాలు ప్రతినిధులు హాజరవుతున్నారని వారన్నారు. భారీ ప్రదర్శన బహిరంగ సభ వేలాది మందితో జన సేవాదళ్ కవాతులు ప్రదర్శనలు జరుగుతాయన్నారు. యూపీఏ వన్ ప్రభుత్వంలో చరిత్రత్నిక సమాచార హక్కు చట్టం ఉపాధి హామీ పథకం అటవీ హక్కుల చట్టం తీసుకురావడానికి సిపిఐ కృషి చేసిందన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా దేశంలో గిరిజన బలహీన వర్గాలకు చెందిన 50 లక్షల పైగా కుటుంబాలు కోటి ఎకరాలు భూమిపై హక్కు పొందెందుకు సిపిఐ పార్టీ ఎంతగానో పోరాడిందన్నారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని రైతుల ఆదాయం రెట్టింపు ధరలు తగ్గిస్తామని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇలాంటి ప్రజాకర్షణ నినాదాలతో అధికారులకు వచ్చి బిజెపి వాటిని అమలు చేయకుండా దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు భావోద్వేగాలు రెచ్చగొడుతూ వరుసగా అధికారానికి నిలబెట్టుకుంటూ వస్తుందని వారన్నారు. ఆర్ దశాబ్దాలుగా ప్రజలు కార్మికుల త్యాగాలతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను ఎల్ఐసి బ్యాంకులు టెలికాం గనులు చివరికి రక్షణ రంగ పరిశ్రమలను సైతం ప్రైవేటుకు కట్టబెట్టుందన్నారు దేశ సంపదను బడా బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఆదాని అంబానీ ఇలాంటివారికి దోచిపెడుతున్నారని ఆరోపించారు.

సంపన్నులు మరింత సంపన్నులుగా అవుతుంటే పేదలు మరింత పేదలుగా అవుతున్నారని రైతులను కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చే చట్టాలు తెచ్చారనీ ధ్వజమెత్తారు.  వీటి రద్దు కొరకు సిపిఐ పార్టీ నిరంతరం పోరాడుతుందని దేశంలో కమ్యూనిస్టుల ఐక్యత వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఐక్యత గురించి సిపిఐ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఖమ్మంలో జరిగే ఈ భారీ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు శ్రేయోభిలాషులు రైతులు వ్యాపారులు ఉద్యోగులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  మండల కార్యదర్శి అంజన్నపెళ్లి రామలింగం, మండల సమితి సభ్యులు ఎండి సయ్యద్, వలపట్ల వెంకన్న, దాసర దుర్గమ్మ, ఎస్కే షమీం, బంటు రాజేశ్వరి, బంటు బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -