నివాళులర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-మంచాల
సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి జగన్ తల్లి సాలమ్మ మంచాల మండల పరిధిలోని కాగజ్‌ఘాట్‌లో బుధవారం మృతిచెందింది. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ కాగజ్‌ఘాట్‌కు వెళ్లి సాలమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. జగన్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి వెంట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, నాయకులు ఐలయ్య, రావుల జంగయ్య, పి.అంజయ్య, ఎన్.శ్యామ్ సుందర్, పొచమోని కృష్ణ, కాళ్ల జంగయ్య, సయ్యద్ రజాక్ పాషా, చందు నాయక్, సపావత్ వెంకటేష్, నాగేష్, పూజారి యాదయ్య తదితరులు ఉన్నారు.
సీపీఐ(ఎం) నేత జగన్‌కు మాతృవియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



