- Advertisement -
న్యూఢిల్లీ : మార్క్సిస్టు ప్రపంచ దృక్పథం పరిణామ క్రమంలో, దాని సిద్ధాంత పునాదులను విస్తరించడంలో కార్ల్ మార్క్స్‌తో పాటూ కీలకమైన పాత్రను పోషించారంటూ ఫ్రెడరిక్ ఏంగెల్స్‌ను సీపీఐ(ఎం) గుర్తు చేసుకుంది. కార్మిక శక్తిని విజయ పథం వైపునకు నడిపించే సామర్ధ్యం గల విప్లవాత్మక సంస్థను నిర్మించేందుకు తన యావత్ జీవితాన్ని ఆయన అంకితం చేశారని కొనియాడింది. లెనిన్ వ్యాఖ్యానించినట్లుగా, తమ శక్తి ఏమిటో, దాని గురించి ఎంత చైతన్యవంతంగా వుండాలో కార్మిక వర్గానికి ఏంగెల్స్ నేర్పారు. కలలకు బదులుగా శాస్త్రీయ దృక్పథాన్ని జోడించారు. రెడ్ శాల్యూట్ కామ్రేడ్ అంటూ ఏంగెల్స్‌కు సీపీఐ(ఎం) జోహార్లు అర్పించింది.
- Advertisement -



