రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయించాలి
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలోనికి వచ్చిన ఆర్డిఓ గణేష్ కు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించినట్లు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు తెలిపారు. బుధవారం రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లికుదురు మండలంలోని రైతాంగానికి సరిపడా యూరియా అందించాలని నెల్లికుదురు తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన తొర్రూరు ఆర్డీవో గణేష్ కి సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని అన్నారు.
మండలంలో ని వివిధ గ్రామాల చెందిన రైతులు మీడియా బస్తాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నాడు. ఓరి నాట్లు వేసి చాలా రోజులు అయినప్పటికి మొదటి దఫా యూరియా చేయవలసిన సమయం దాటిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చెందతున్నారని అన్నారు. రైతులు వరి నాట్లు, మొక్కజొన్న, పత్తి, వివిధ రకాల పంటలు వేసుకుని నేలలు గడిచిన ఇంతవరకు యూరియా మందు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమమే దేయమని గొప్పలు చెప్పడం తప్ప ఆచరణలో పూర్తిగా విఫలం చెందిందని ఆయన అన్నారు. తక్షణమే రైతంగానికి యూరియా బస్తాలు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ మల్లయ్య ఉప్పలయ్య వెంకటయ్య వీరన్న తదితరులు పాల్గొన్నారు.
తొర్రూర్ ఆర్డీవో గణేష్ కు సీపీఐ(ఎం) అధ్వర్యంలో వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES