Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచిన్నారి హత్యను నిరసిస్తూ భువనగిరిలో సీపీఐ(ఎం) నిరసన

చిన్నారి హత్యను నిరసిస్తూ భువనగిరిలో సీపీఐ(ఎం) నిరసన

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై నోరు విప్పాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య

నవతెలంగాణ-భువనగిరి
నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల చిన్నారిని హత్య చేసిన కుల దురహంకారులను కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు విప్పాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. చిన్నారి హత్యను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలోని జగ్జీవన్‌రామ్‌ చౌరస్తాలో నిరసన జరిగింది. ఈ సందర్బంగా వీరయ్య మాట్లాడుతూ.. కుమ్మెర జాతరలో చిన్నారి హత్య ఘటన జరిగి వారం గడుస్తున్నా పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టుగా వ్యవహారిస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బలహీనవర్గాలపై కుల దురహంకార హత్య జరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదన్నారు.

కులం పేరుతో జరిగే హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసి సక్రమంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాస చారి, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, బొలగాని జయరాములు, బొల్లు యాదగిరి, అవ్వారు రామేశ్వరి, ఎండి. పాషా, బొడ్డుపల్లి వెంకటేశం, గంగాదేవి సైదులు, ఎంఏ. ఇక్బాల్‌, వనం ఉపేందర్‌, గుండు వెంకట నర్సు, కోట రామచంద్రారెడ్డి, మధ్యపురం రాజు, బల్గూరి అంజయ్య పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -