నవతెలంగాణ-హైదరాబాద్ : పంటల కొనుగోలు చేయాలని, కార్మికులకు కనీస వేతనాల సవరణ, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇచ్చారు.
పంటల కొనుగోలు
తెలంగాణలో యాసంగి పంటల కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని, 62 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 140 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ యిచ్చింది. 8,576 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. నిన్నటివరకు 50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు ప్రకటించారు. ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాల్సి వుంది. రోహిణి ప్రారంభమైంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడిసిపోయింది. రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు. మిల్లర్లు కొనుగోలు కేంద్రం దగ్గర తరుగు తీసిన తర్వాత మళ్ళీ మిల్లు దగ్గర తరుగు తీస్తున్నారు. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు పడాల్సి వస్తున్నది. వీటిని నివారించాలని కోరుతున్నాం..
యాసంగిలో పండిన మొక్కజొన్న ఎకరానికి 40 క్వింటాళ్ళ వరకు దిగుబడి వస్తున్నది. కానీ, ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా 26 క్వింటాళ్ళే కొనుగోలు చేస్తున్నది. మిగిలిన మొక్కజొన్నలను మద్దతు ధర కంటే తక్కువ ధరకు (ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకొని రైతులు నష్టపోతున్నారు. పండిన మొక్కుకొన్నలన్నింటినీ కొనే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నాం. కొనుగోలు చేసి నెలరోజులైనా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయలేదు. జొన్నలు, నల్ల కునుమలు యాసంగిలో బాగా దిగుబడి వచ్చింది. వీటిని కూడా సకాలంలో కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని కోరుతున్నాం.
కనీస వేతనాలకు సంబంధించి
షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ సుమారు 14 సం॥రాలు తర్వాత కనీస వేతనాలు సవరించడాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ, కనీస వేతనాలను రాష్ట్రంలో 3 జోన్స్ (మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీలు, గ్రామీణ ప్రాంతాలు)గా విభజించారు. దీనివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. వేతనాలను 4 క్యాటగిరీలుగా విభజించి అన్ని రంగాల్లో ఒకే -రీతిలో వేతనాలు పెంచడం వల్ల గతంలో ఎంప్లాయిమెంట్స్లో వివిధ రకాల పనులకు వివిధ రకాలుగా ఉన్న పద్ధతి అలేకుండా పోతుంది. కనీస వేతనాల పెంపుదల సందర్భంగా కరువుభత్యం గురించి ప్రస్తావన చేయలేదు.
పెరిగిన వేతనాలు కూడా 4 క్యాటగిరీలలో అన్సెప్ట్ వద్కర్కు రూ. 1 లవేలు, సెమిస్సిల్డ్ వద్కరు రూ. 17 వేలు, స్క్రిప్ట్ వర్కరు రూ. 18,500లు, హైస్కిల్డ్ వర్కర్లకు రూ.20 వేలు పెంచినట్లుగా ప్రకటించారు. ఇందులో అన్సిల్స్ వర్కరు తప్ప మిగితా వారికి బేసిక్ కరువుథత్యం కలుపుకొని ఇప్పటికే వస్తున్న జీతానికి, పెరిగిన జీతానికి పెద్ద తేడా ఏమీలేదు. పట్టణ, గ్రామీణ, ప్రాంతాల్లో వేతనాలు ఇంకా తగ్గే పరిస్థితి ఉన్నది.
కాంట్రాక్ట్ లేబర్ జీవో నెం.11 ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో రూ. 18,098ల నుండి రూ.23,683 వరకు వేతనం పొందుతున్నారు. ప్రభుత్వం పెద్దగా పెంచిందేమీలేదు. ప్రస్తుతం అమలులో ఉన్నా జీనో నెం. 4తో పోలిస్తే కూడా కొన్ని కేటగిరీల్లో స్వల్పంగా పెరుగుదల, కొన్ని కేటగిరీల్లో ప్రస్తుతం పొందుతున్న వేతనం కంటే తగ్గుదల ఉ న్నది. జీవో నెం.4లో స్కిల్డ్ వర్కర్ కి వేతనం రూ. 19,572లు ఉండగా, ప్రభుత్వం ప్రకటించిన వేతనం రూ. 18,500 మాత్రమే గతంలో పోలిస్తే రూ.1,072లు తగ్గింది. సఫాయి కర్మవాదులకు జోనె1లో పాత వేతనం రూ.17,332లు ఉండగా, కొత్త వేతనం రూ.16వేలు, ఈ కార్మికులకు రూ.1,332లు తగ్గింది. జోన్ 2లో పాత వేతనం రూ. 17,072 లు ఉండగా, కొత్త వేతనం రూ.16వేలుగా ఉన్నది. ఈ కార్మికులకు రూ.2,072లు తగ్గింది. జోన్ 3 పాత వేతనం రూ.16వేలు వేతనం ఉండగా, కొత్త వేతనం రూ.14 వేలు. ఈ కార్మికులకు రూ.2వేలు వేతనం తగ్గింది.
గతంలో కనీస వేతనాల సలహా మండలి బోర్డు అని స్కిల్డ్ కార్మికుడికి కనీస వేతనం రూ. 18,019లు, కరువుభత్యం ఒక్కొక్క పాయింటికి రూ.12లు సిపార్సులు చేసింది. దీంతో 2021 జూన్ 5న అప్పటి ప్రభుత్వం 5 జీవోలను జారీ చేసింది. వాటికి నాటి నుండి నేటి వరకు గెజిట్ విడుదల చేయలేదు. ఈ జీవోల ప్రాతిపదికన నేను కనీస వేతనాలు మరింత పెరిగేవి. దేశానికే ఆదర్శవంతంగా ఉందే విధంగా శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనాలను పెంచుతామని తమరు ప్రకటించారు. కానీ అచరణలో పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచలేదు.
పెరిగిన ధరలు 1948 కనీస వేతనాల చట్టం, డాక్టర్ అక్ట్రాయిడ్ నిర్వహించిన విధానం, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా శాస్త్రీయంగా వేతనాలను లెక్కిస్తే రూ.32 వేలు పెంచాలి. కార్మికులు, కార్మిక సంఘాలు కనీసం రూ.26,000లు వేతనం ఉండాలి. కర్ణాటక రాష్ట్రంలోని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం 60శాతం కార్మికుల వేతనాలను పెంచింది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలోని కార్మికుల వేతనాలను తగ్గించారు. కార్మికుల డిమాండ్లను మరియు కర్ణాటక ప్రభుత్వం పెంచిన వేతనాలను పరిగణంలోకి తీసుకొని ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను సవరించి కనీసలరూ.26,000లు వేతనం నిర్ణయించాలి. కరువుభత్యం ఒక్కొక్క పాయింట్ కి రూ.12లు ఉండాలి. జోన్ల విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం.
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న నోటిఫికేషన్లు జారీ చేసి, నిరుద్యోగులను ఆదుకోవాలని కోరుతున్నాము.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ, రాష్ట్ర కార్యదర్శీ వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టీ జ్యోతి, మల్లు లక్ష్మీ,పోతినేని సుదర్శన్ రావు, టి. సాగర్, పి. ప్రభాకర్, నున్న నాగేశ్వర రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శీ వర్గ సభ్యులు మడిపల్లి గోపాలరావు, సామినేని రామారావు సతీమణి స్వరాజ్యం ఉన్నారు.



