Friday, September 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసీపీసీ పాఠశాలను సందర్శించిన సీపీఐ(ఎం) బృందం

సీపీసీ పాఠశాలను సందర్శించిన సీపీఐ(ఎం) బృందం

- Advertisement -

పాఠశాల ఉపాధ్యక్షులు గాంగ్‌ వీబిన్‌తో భేటీ

బీజింగ్‌ : ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం గురువారం అక్కడి చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) శాశ్వత పాఠశాలను సందర్శించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యక్షులు గాంగ్‌ వీబిన్‌తో సమావేశమైంది. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంపై మార్క్సిజం యొక్క నిరంతర సైద్ధాంతిక ఔచిత్యంపై పార్టీ అభిప్రాయాలను వెల్లడించారు. ఎం.ఎ.బేబీ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం సోమవారం అర్ధరాత్రి బీజింగ్‌కు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ బృందంలో బేబీతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు మహ్మద్‌ సలీం, జితేంద్ర చౌదరి, ఆర్‌.అరుణ్‌ కుమార్‌, కేంద్ర కమిటీ సభ్యులు కె.హేమలత, సి.ఎస్‌.సుజాత ఉన్నారు. ఈ నెల 30వరకు ఈ బృందం చైనాలో పర్యటించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -