Friday, October 3, 2025
E-PAPER
Homeజిల్లాలుRRR: సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 6న ఆర్ఆర్ఆర్ లో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులతో ధర్నా

RRR: సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 6న ఆర్ఆర్ఆర్ లో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులతో ధర్నా

- Advertisement -

రైతులంతా స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొనాలి

ఎండి జహంగీర్ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

నవతెలంగాణ భువనగిరి

ప్రభుత్వం త్రిబుల్ ఆర్ కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించింది భువనగిరి జిల్లాలో తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్, నారాయణపురం, మండలాల్లో వేల ఎకరాల రైతుల పట్టా భూములు త్రిబుల్ ఆర్ భూ సేకరణలో కోల్పోతున్నారు ప్రధానంగా చిన్న సన్నకారు రైతులే నిర్వాసితులవుతున్నారు భూములు కోల్పోతున్న రైతులతో ఈ నెల 6న ఎచ్ఎండిఏ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ముందు ప్రకటించిన అలైన్మెంట్ కాకుండా దాన్ని 28 కిలోమీటర్లు కుదించడం వల్ల పట్టణ మండల కేంద్రాలకు చేరువలో ఉన్న సారవంతమైన వరి, పత్తి పండే భూములు అత్యధికం కోల్పోతున్నారు. సేద్యయోగ్యం కానీ భూములను తీసుకోవాలని చట్టం చెబుతున్న కొందరు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు సంపన్న వర్గాలను కాపాడేందుకు అలైన్మెంట్ ను మార్చి రైతాంగానికి ఎక్కువ నష్టం కలిగించాలని చూస్తున్నారన్నారు. దీన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.

ప్రభుత్వ నిర్ణయం వల్ల వందల కుటుంబాలు భూమిలేని నిరుపేదలుగా మారే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అలైన్మెంట్ను గత ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు త్రిబుల్ ఆర్ సమస్యను వాడుకొని అధికారంలోకి రాగానే అలైన్మెంట్ మార్చుతామని హామీ ఇచ్చి ఇచ్చిన హామీని మర్చిపోయ్యరన్నారు. ఇప్పుడు రైతులకు మొండి చేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రైతాంగానికి నంగనాచి మాటలు చెప్పడం తప్ప చేసింది శూన్యం అన్నారు. ఈ పరిస్థితులలో రైతులకు తగిన న్యాయం చేయాలని నిర్వాసితుల సమస్యను ప్రభుత్వం ఉన్నత స్థాయిలో రైతులతో సమీక్షించాలని రైతుల గోస వినాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ డిమాండ్ పై సమస్త రైతాంగాన్ని కదిలిస్తూ ఈనెల 6న ఎచ్ఎండిఎ కార్యాలయం ముందు నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా త్రిబుల్ ఆర్ సమస్య ఉన్న ఎనిమిది జిల్లాల నుండి రైతులు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జల్లెల పెంటయ్య, బూరుగు కృష్ణారెడ్డి గుంటోజు శ్రీనివాసచారి, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, బొల్లు యాదగిరి, మద్దెల రాజయ్య, ఎండి పాష, బొడ్డుపల్లి వెంకటేష్, గంగదేవి సైదులు, దోడ యాదిరెడ్డి మద్దేపూరం రాజు బోలగాని జయరాములు, ఎంఎ ఇక్బాల్, వనం ఉపేందర్, గడ్డం వెంకటేష్, రాగీరు కిష్టయ్య, కోట రామచంద్రారెడ్డి, పైళ్ళ గణపతిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -