నవతెలంగాణ -రెంజల్
మండలం లోని నీలా గ్రామ శివారు లో ఆదివారం సీపీఐ(ఎం) బృందం క్షేత్రస్థాయిలో పర్య టించి పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి చేతికి వచ్చే పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2000 ఎకరాలలో సోయపంటతో పాటు వరి పంట నీట మునిగి రైతులను నష్టాన్ని కలిగించిందని ఆమె అన్నారు. వరి ఎకరానికి 30 వేల రూపాయలు, సోయా పంటకు 50 వేల రూపాయల పంట నష్టపరిహారాన్ని తక్షణమే ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వాధికారులు సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ రైతులకు నిండా ముంచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె అన్నారు. తక్షణమే జిల్లా యంత్రాంగం ప్రతిస్పందిస్తూ యుద్ధ ప్రాతిపదికపై రైతులకు నష్ట పరిహారం అందజేయాలన్నారు. వర్షాలకు కూలిన ఇండ్లను అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి వారికి వెంటనే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్, పసియుద్దీన్, బండారి చిన్నలాలు, అర్బాజ్, బండారి సాయిలు, సంగీత, శాలిని తదితరులు పాల్గొన్నారు.
రెంజల్ మండలం నీల శివారులో సీపీఐ(ఎం) బృందం పర్యటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES