Friday, October 17, 2025
E-PAPER
Homeఆదిలాబాద్సీపీఆర్ తో ప్రాణాలను కాపాడుకోవచ్చు

సీపీఆర్ తో ప్రాణాలను కాపాడుకోవచ్చు

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హత్నూర్
గుండెపోటు వచ్చిన వ్యక్తికి సీపీఆర్ విధానం ద్వారా చికిత్స అందిస్తే మనిషి బ్రతికే అవకాశం ఉంటుందని డాక్టర్ భీంరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో 108సిబ్బందితో సీపీఆర్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులకు  సీపీఆర్ పై డెమో చూపించారు. మనిషీ అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి వచ్చి స్పృహ కోల్పోయి పడిపోతే సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు సీపీఆర్ పై అవగాహన పెంచుకొని, అపదలో ఉన్న వ్యక్తిని కాపాడుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ రాంకిషన్, 108 ఈఏంటీ సతీశ్, ఉపాధ్యాయులు రమేశ్, భగత్, శ్రీనివాస్, పైలెట్ నవీన్ కుమార్, మహేశ్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -