Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంటనష్ట సర్వేలు పకడ్బందీగా నిర్వహించాలి

పంటనష్ట సర్వేలు పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి, చిన్న టాక్లీ, సిర్పూర్, లింబూర్, కుర్లా,  యానబూర, ఇలేగావ్, మాదన హిప్పర్గ్, గ్రామాలు వర్షాలు కారణంగా  సోయాబీన్, వరి, పంటలు నష్టం భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో డోంగ్లీ మండల సీనియర్ నాయకులు గజ్జు దేశాయ్, మాజీ ఎంపీటీసీ దీన్ దయాల్, ఏఈఓ లింబూర్ క్లస్టర్ గజానంద్ కు పంట నష్టం జరిగిన ఒక్క ఎకరం కూడా వదలకుండా సర్లేలో నమోదు చేయాలని రైతులు ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో పెద్ద టాక్లి గ్రామ అధ్యక్షులు సాయలు గోండా, మండల కోఆర్డినేటర్ విలాస్ గైక్వాడ్ పెద్ద టాక్లి రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -