- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
శ్రావణమాసం ప్రారంభం మొదటి సోమవారం అయినందున మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సోమలింగాల గుట్ట శివాలయానికి భక్తులు బారులుతీరారు. ఈ క్రమంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని హెచ్ కేలూర్ గ్రామానికి చెందిన విట్టల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానాన్ని చేపట్టారు. శ్రావణమాసం సందర్భంగా సోమ లింగాల శివాలయానికి భారీ సంఖ్యలో వచ్చే భక్తులంతా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆలయాన్ని సందర్శించే ప్రత్యేక పూజల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -