Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో చేపల కోసం కిక్కిరిసిన జనాలు..

మండలంలో చేపల కోసం కిక్కిరిసిన జనాలు..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ : మండల కేంద్రంలో మిరుగు సందర్భంగా చేపల కోసం జనం కిక్కిరిసి పోయారు. మత్స్యకారులు ఉదయం నాలుగు గంటల నుంచి మిరుగును పురస్కరించుకొని సామూహికంగా పెద్ద చెరువులో చేపలు పట్టారు. వర్షాకాలం మొదలవడంతో రైతులు మినుగు పండుగను ఘనంగా చేసుకుంటారు. ఈరోజు చేపలు వండుకొని తినడం ఆనవాయితీగా మారింది. ఈరోజు తప్పకుండా చేపలు తింటే మంచి జరుగుతుందని రైతుల నమ్మకం. దీంతో మత్స్యకారులు కిలో రూ.150 ఉన్నాకూడా ప్రజలు తండోపతండాలుగా తీసుకెళ్లారు. స్థానిక ప్రజలతో మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసి పోయింది. గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -