Saturday, May 24, 2025
Homeతాజా వార్తలుభారీ వర్షాలకు కోతకు గురైన కల్వర్టు మట్టి ..

భారీ వర్షాలకు కోతకు గురైన కల్వర్టు మట్టి ..

- Advertisement -

– రెండు చోట్ల పెద్ద గుంతలు
– ఆదమరచి వస్తే వాహనదారులకు పెను ప్రమాదం 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వర్షాకాలం ఆరంభమే కాలేదు… చెడగొట్టు వానల రూపంలో రెండు రోజులు కురిసిన భారీ వర్షాలకు కల్వర్టులు కోతకు గురవడం మొదలయ్యాయి. అధికారులు తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకోవడంతో తరచు వరదల తాకిడికి రోడ్లు, కల్వర్టులు కోతకు గురవుతూనే ఉన్నాయి. శాశ్వత ప్రతిపాదికన పనులు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు. మండల కేంద్రం నుండి ఉప్లూర్ గ్రామానికి వెళ్లే దారిలో వరద కాలువ దిగువ భాగంలో బిటి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు కోతకు గురైంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కమ్మర్ పల్లి గ్రామం నుండి వచ్చే వర్షపు వరద నీటి తాకిడికి కల్వర్టు పై నుండి వరద నీరు పారి కల్వర్టు వద్ద రోడ్డు పక్కన పెద్ద ఎత్తున మట్టి కోతకు గురైంది. గత కొన్ని సంవత్సరాలుగా పతి వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు, తుఫానుల వల్ల పడే భారీ వర్షాలకు ఈ కల్వర్టు వద్ద రోడ్డుతో పాటు కల్వర్టు మట్టి కోతకు గురవుతూనే ఉంది. కల్వర్టు వద్ద మట్టి కూతకు గురవడంతో పెద్ద గుంత ఏర్పడింది. గతంలో ఈ కల్వర్టు వద్ద ఏర్పడ్డ పెద్ద బుంగను అధికారులు మొరం నింపి చదును చేశారు. అధికారులు ఇలా మొరం నింపడం, భారీ వర్షాల మూలంగా వచ్చే వరద నీతి తాకిడికి ఆ మట్టి కొట్టుకుపోయి బుంగ ఏర్పడడం ఓ ఆనవాయితీల మారింది. కలవట్ వద్ద కాకుండా కొద్ది దూరంలో రోడ్డు ప్రక్కన కూడా రోడ్డును అనుకోని మట్టి కోతకు గురవ్వడంతో అక్కడ కూడా పెద్ద గుంత ఏర్పడింది. ఈ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులకు భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కోతకు గురై ఏర్పడే ఈ గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గతంలో రాత్రి సమయంలో ఈ రోడ్డు గుండ పయనించిన వాహనదారులు కల్వర్టు వద్ద ఏర్పడ్డ గుంతలో పడిన సందర్భాలు ఉన్నాయి. వర్షాకాలం ఆరంభం కాకుండానే కురుస్తున్న భారీ వర్షాలకు కల్వర్టు తో పాటు రెండు చోట్ల రోడ్డును ఆనుకొని కోతకు గురై పెద్ద గుంతలు ఏర్పడడం ప్రయాణికులతో పాటు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తుంది. గత ప్రభుత్వం హాయంలో ఈ కల్వర్టు వద్ద హై లెవెల్ కల్వర్టు బ్రిడ్జిని  నిర్మించేందుకు మంజూరు అయిన నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దయిన విషయం తెలిసిందే. ఆ నిధుల్ని కాంగ్రెస్ నాయకులు మంజూరు చేయించి పనులు చేయించాలని ప్రజలు అంటున్నారు.తూతూ మంత్రంగా కాకుండా శాశ్వత ప్రతిపాదికన పనులు చేసి కల్వర్టు వద్ద ఏర్పడ్డ గుంతలను పూడ్చివేసి, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -