Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సేవ్ ట్రీ.. సేవ్ ఎర్త్.. అనే నినాదంతో సైకిల్ యాత్ర

సేవ్ ట్రీ.. సేవ్ ఎర్త్.. అనే నినాదంతో సైకిల్ యాత్ర

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా మైదుకూరు మండలం బస్వాపురం గ్రామానికి చెందిన యువకుడు కార్తీక్ ఫిబ్రవరి 6 న తన ఇంటి నుండి సేవ్ ట్రీ సేవ్ ఎర్త్ అనే నినాదంతో సైకిల్ యాత్ర చేపట్టాడు. యాత్రలో భాగంగా కార్తీక్ చారకొండ కు చేరుకున్నారు.ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం తన సైకిల్ యాత్ర కొనసాగుతుందని అన్నారు. మానవాళి మనుగడకు చెట్లు చాలా అవసరమని, అందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్,తమిళనాడు, కర్ణాటక, గోవా, ఒడిశా రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర కొనసాగించి 4,200 కిలోమీటర్లు పూర్తి చేశానన్నారు. భారతదేశ వ్యాప్తంగా పర్యావరణ పై ప్రజల్లో చైతన్యం పరిచి తన సైకిల్ యాత్రను ముగిస్తానని తెలిపారు. అనంతరం చారకొండ నుంచి నల్గొండ జిల్లా దేవరకొండ వైపు తన సైకిల్ యాత్ర కొనసాగించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img