నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని రూసేగావ్ గ్రామంలోని కాంబ్లే శంకర్ ఇంట్లో శనివారం ఉదయం సిలిండర్ నీకుతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమాచారం తెలుసుకున్న మద్నూర్ అగ్నిమాపక సిబ్బంది ఫైర్ వాహనంతో హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లి మంటలను అదుపుచేశారు. సిలిండర్ పేలకుండా కాపాడడమే కాకుండా ఇంట్లో ఉన్న తులం బంగారం, 15 తులాల వెండిని, కాపాడి ఫైర్ అధికారులు ఆ కుటుంబానికి అందజేశారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇంటి యజమానికి రూ.60 వేల ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ అధికారులు అంచనాల ద్వారా తెలిసింది. ఈ అగ్ని ప్రమాదంలో ఫైర్ అధికారులతో పాటు పోలీస్ శాఖ సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందించారు. అధికారుల పనితీరుపై గ్రామస్తులు ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ గోవింద్ అభినందించారు.
సిలిండర్ లీకేజీ.. పెను ముప్పును తప్పించిన ఫైర్ సిబ్బంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES