Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పులికి ఆహారంగా మారుతున్న పాడి పశువులు 

పులికి ఆహారంగా మారుతున్న పాడి పశువులు 

- Advertisement -

4 ఏళ్లలో 180 పశువులు మృతి 
నవతెలంగాణ – అచ్చంపేట
నల్లమల అడవుల్లో పశువులకు మృత్యువు ముసురుతోంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతం సమీపాన మేతకు తీసుకెళ్లిన పశువులు పులులకు గ్రాసమవుతున్నాయి. పాడి పశువులు పులులకు ఆహారంగా మారుతున్నడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పశువులను మేత కోసం నల్లమల్ల అడవికి తీసుకొస్తారు. ఫారెస్ట్‌ శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. 2020–21లో 30, 2022–23లో 50, 2023–24లో 77, 2024–25లో ఇప్పటివరకు 43 పశువులు పులుల దాడుల్లో ఆహారంగా మారాయి.

పశువులే కాకుండా బోర్లు పీకలు కూడా పురులకు ఆహారంగా మారుతున్నాయి  దీంతో పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. మృగరాజు పంజా విరిస్తుండగా… ప్రజలు కంగారు పడిపోతున్నారు. మృతి చెందిన పశువులకు సంబంధించిన రైతులకు నామ మాత్రం నష్టపరిహారం  చెల్లించి  అటవీ శాఖ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.  పులులు చంపిన పశువులకు పశువుల యజమానులకు పరిహారం చెల్లించడానికి భారత ప్రభుత్వానికి ఒక వ్యవస్థ ఉంది, కానీ ఈ వ్యవస్థకు పరిమితులు ఉన్నాయి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -