Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాడి పశువుల గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం

పాడి పశువుల గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల 
ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత పాడి పశువుల గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ మహబూబ్‌నగర్ సంయుక్తంగా నిర్వహించాయి. గ్రామ సర్పంచ్ సత్తు భూపాల్ రావు, ఉప సర్పంచ్ మద్దెలబండ కొండల్, జిల్లా అధికారి బి. జ్ఞానశేఖర్ ప్రారంభించారు. టీకాలు, మినరల్ మిక్సర్, లింగ నిర్దారిత వీర్యం ద్వారా గర్భధారణపై సూచనలు ఇచ్చారు. డా. ప్రవీణ్ కుమార్, ఇతర వైద్యులు పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -