Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాడి రైతుల సదస్సు విజయవంతం..

పాడి రైతుల సదస్సు విజయవంతం..

- Advertisement -

హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  
నవతెలంగాణ- ఆలేరు టౌను 

నార్మల్ మదర్  డేయిర్ లో పెండింగ్ లో ఉన్న పాడి రైతుల బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, పరిష్కారం కొరకు రాజకీయాల కతీతంగా కలిసి పనిచేయాలని కోరుతూ ఆలేరు పట్టణంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పాడి రైతుల సదస్సు విజయవంతమైంది. పాడి రైతుల సమస్యల పరిష్కారం కొరకు  పాలసీతాలీకరణ కేంద్రం వద్ద  బొల్ల కొండల్ రెడ్డి అధ్యక్షతన  సమావేశం  నిర్వహించారు. నార్మల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, రైతు సంఘం నాయకులు బబ్బూరి  పోశెట్టి, మంగ నరసింహులు, కొల్లూరి రాజయ్య, చెక్క వెంకటేష్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు  పాడి రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

పాడి రైతుల సమస్యల పరిష్కారం కొరకు దశలవారీగా కార్యక్రమాలు చేపడదామని పిలుపునిచ్చారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా , పాల సంఘాల డైరెక్టర్ల గెలుపుతో ప్రభుత్వం పై వ్యతిరేకత కనబడినదని అన్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పాడి రైతుల సమస్యల   పరిష్కారం కొరకు, కమిటీగా వస్తే కేంద్రమంత్రి అమిత్ షా ని , కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ల ద్వారా కలుద్దామన్నారు. 30 వేల రైతులకు  చెందిన 30 కోట్ల బిల్లులు  చెల్లించాలని, లాస్ ఎందుకు వస్తుందని, డే యిరి ని ముంచే ప్రయత్నం కనబడుతుంది అన్నారు. మాజీ నార్మల్ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత చైర్మన్ నిర్లక్ష్యం కారణంగా లక్ష లీటర్ల పాల ఉత్పత్తి గతంలో ఉండేదని, నేడు 50 వేలకు పడిపోయిందన్నారు.

నల్లగొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల కేంద్రం నార్మల్గా మారిందని చెప్పారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ..  ప్రయివేటు డైరీలు లాభాలలో ఉన్నాయని, ప్రభుత్వా అనుబంధ సంస్థ మధర్ డయిరీ నష్టాల్లో ఎందుకు ఉందని ప్రశ్నించారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జనార్దన్ మాట్లాడుతూ .. దోచుకునే వారే ఎన్నికై , కోట్ల విలువైన ఆస్తుల అమ్మకం కొరకు కుట్రలు పన్నుతున్నారన్నారని, అవినీతి పెరిగిందని , క్యాంపులలో డబ్బులు పంచే ఈ నాయకులు పాడి రైతుల బిల్లులు ఎందుకు చెల్లించారని  ప్రశ్నించారు. ఆర్ జనార్ధన్  దొంతిరి సోమిరెడ్డి, కళ్ళేపు అడవయ్య, పిఏసిఎస్ చైర్మన్ మొగలిగాని మల్లేశం, మాజీ మున్సిపల్ చైర్మన్  వస్పరి శంకరయ్య, పుట్ట మల్లేశం, గంగుల శ్రీనివాసు, పాల సంఘం నాయకులు మామిడాల బాల మల్లేష్, సుదగాని సత్య రాజయ్య, ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, ఊదరి రాములు, ఇక్కిరి శ్రీనివాస్,  నియోజకవర్గంలోని పాల సంఘాల చైర్మన్లు  సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రైతుల బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో పాల సంఘాల చైర్మన్లు, నియోజకవర్గంలోని పాడి  రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -