నవతెలంగాణ – అశ్వారావూపేట : సెర్ప్ – డి.ఆర్.డి.ఎ – హెచ్.ఆర్ విభాగం – జిల్లా కలెక్టర్,చైర్మన్, డి.ఆర్.డి.ఎ శాఖాధికారుల ఆదేశానుసారం – గిరిజన గ్రామాల లో ఈనెల 03వ తేదీ నుండి 10 వ తేది వరకు “దర్తి అభా జాతీయ గ్రామ్ ఉత్కర్శ్ అభియాన్ (డీఏజేజీయూఏ)” గ్రామ సభలను ప్రతి పంచాయతీలోని ప్రతీ గిరిజన ఆవాసాలలో ప్రధాన మంత్రి జన సురక్ష పథకాల పై (పీఎంఎస్బీవై/పీఎంజేజేవై) గ్రామ సభ్యులకు పూర్తి అవగాహన కల్పిస్తూ ఇన్యూరెన్స్ (100%) నమోదు చేయుటకై ఆదేశాలు జారీ చేసినట్లు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ బుధవారం ప్రకటించారు.
ఐటీడీఏ భద్రాచలం పీఓ రాహుల్ సంబంధిత అధికారులతో ఐ.డి.ఓ.సి పాల్వంచ లో గత నెల 30 వ తేదీలో జరిగిన సమావేశంలో వై సూచిక అనుసరించి, జిల్లా లోని (19) ఆదివాసి గిరిజన మండలాల లోని (10) గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దర్తి ఆభా జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ (డీఏజేజీయూఏ)” గ్రామ సభలు క్షేత్రస్థాయిలో 03 వ తేదీ నుండి 10 వరకు నిర్వహించవలసినదిగా ఆదేశాలు జారీ చేసారని తెలిపారు.
ఈ గ్రామ సభల్లో ప్రతి గ్రామ పంచాయతీ నందు ప్రధానమంత్రి జవ మరక్ష పథకాలపై (పీఎంఎస్బీవై /పీఎంజేజేబీవై ) గ్రామ సభ్యులకు పూర్తి అవగాహన కల్పిస్తూ ఇన్సూరెన్స్ నమోదు చెయాలని తెలిపారు.
1) పీఎంఎస్బీవై: ఈ స్కీమ్ నందు 18 -70 సంవత్సరం లోపు గలవారు అర్హులు. ప్రీమియం రూ.29/-సంవత్సరానికి మరియు భీమా కవరేజీ- రూ.2.00 లక్షలు.
2) పీఎంజేజేబీవై: ఈ స్కీమ్ నందు 18 – 50 సంవత్సరం లోపు గలవారు అర్హులు ప్రీమియం రూ.436/-సంవత్సరానికి మరియు భీమా కవరిజి- రూ.2.00 లక్షలు (100% రిజిస్ట్రేషన్)
కావున సంబంధిత ఏ.పి.యులు, సి.పిలు, గ్రామ దీపికలు, సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్స్ (సి.ఎస్.పిలు), స్త్రీనిధి వి.ఎల్.ఇ లు, ఫైనాన్సియల్ లీటరపి కోఆర్డినేటర్లు బిజివెస్ కరస్పాండెంట్లు(బి.ఏ లు) మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ లు పూర్తి భాధ్యతలను తీసుకొని గ్రామ సభలను విజయవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసారన్నారు.
అశ్వారావుపేట నియోజక వర్గం అన్నపు రెడ్డి పల్లి అన్నదేవం లో, తేదీ,అశ్వారావుపేట మండలం అనంతారం,ఆసుపాక,బచ్చువారిగూడెం,జమ్మి గూడెం 3 వ తేదీన, కన్నాయిగూడెం,కావడి గుండ్ల లో 4 వ తేదీ,కొత్తమామిళ్ళవారిగూడెం లో 5 తేదీ,నందిపాడు పంచాయితీల్లో 7 తేదీన గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు.