Saturday, June 28, 2025
E-PAPER
Homeసినిమా'డకాయిట్‌' ఫైర్‌ థీమ్‌సందడి మొదలైంది

‘డకాయిట్‌’ ఫైర్‌ థీమ్‌సందడి మొదలైంది

- Advertisement -

అడివి శేష్‌ నటిస్తున్న పాన్‌-ఇండియన్‌ థ్రిల్లర్‌ ‘డకాయిట్‌. ఇటీవలే విడుదలైన ఫైర్‌ గ్లింప్స్‌ ఇంటెన్స్‌ యాక్షన్‌, స్టైలిష్‌ విజువల్స్‌తో అదిరిపోయింది. నేషనల్‌ వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. విజువల్‌గా ఫైర్‌ గ్లింప్స్‌ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేసింది.
తాజాగా ఫైర్‌ థీమ్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భీమ్స్‌ సిసిరోలియో ఈ ఫైర్‌ థీమ్‌ని పవర్‌ఫుల్‌గా కంపోజ్‌ చేశారు. ఇది ఆడియన్స్‌కి ఒక మ్యూజికల్‌ ఫీస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తోంది. అన్ని మ్యూజిక్‌ చార్ట్స్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది.
‘అడివి శేష్‌ నుంచి ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా మంచి కంటెంట్‌ ఉంటుందనే అభిప్రాయం అటు ప్రేక్షకుల్లోను, ఇటు ఆయన అభిమానుల్లోనూ ఉంది. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ‘డకాయిట్‌’ ఉంటుందని నమ్మకంగా చెప్పగలం’ అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రంలో మణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, షానియల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాతగా సుప్రియా యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో నిర్మిస్తున్నారు. దీనికి సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -