Saturday, October 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకులవివక్ష వల్లే దళిత ఐపీఎస్‌ అధికారి మృతి

కులవివక్ష వల్లే దళిత ఐపీఎస్‌ అధికారి మృతి

- Advertisement -

కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హర్యాణాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దళిత ఐపీఎస్‌ అధికారి పోరన్‌ కుమార్‌ కులవివక్ష అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విచారకరమని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై తక్షణమే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఐపీఎస్‌ అధికారిస్థాయిలో ఉన్న దళితుడికే ఇంత అవమానం జరిగితే సామాన్య దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మనువాద సిద్ధాంతం పేరుతో సమాజాన్ని విషతుల్యం చేస్తున్నాయనీ, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. అధికారి కుటుంబానికి కేంద్రం అండగా నిలబడాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -