Thursday, May 8, 2025
Homeతెలంగాణ రౌండప్దర్గాయి హరిప్రసాద్ కు దళితరత్న అవార్డు..

దర్గాయి హరిప్రసాద్ కు దళితరత్న అవార్డు..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి: రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చే దళిత రత్న అవార్డును ఈ సంవత్సరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు భువనగిరి పట్టణానికి చెందిన దర్గా హరి ప్రసాద్ కి బుధవారం హైదరాబాదులోని సంక్షేమ భవన్ సాంఘిక సంక్షేమ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్  నాగరిగారి ప్రీతం చేతులమీదుగా అందజేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవముల సందర్భంగా ప్రతి సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా దళిత సమస్యలపై అంబేద్కర్  ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా పనిచేస్తున్న అత్యుత్తమ వ్యక్తులను గుర్తించి  ఈ అవార్డు అందజేస్తారు. ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీత దర్గాయి హరిప్రసాద్ మాట్లాడుతూ.. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఆలోచన విధానంలో పని చేస్తూ దళిత సమస్యలపై గత రెండు దశాబ్దాలకు పైగా పోరాడుతున్న నన్ను గుర్తించి నాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దళిత రత్న అవార్డు  అందజేసిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతంకు, సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు, అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, నాయకులు పడిగెల ప్రదీప్, దాసరి మధు,  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -