Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంధకారంలో దళితవాడ..

అంధకారంలో దళితవాడ..

- Advertisement -

నవతెలంగాణ – అలంపూర్
రాత్రి వేళల్లో వీధిలైట్లు వెలగక న్యూ ప్లస్ కాలనీ దళితులు అంధకారంలో మగ్గుతున్నారని కేవీపీఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. మంగళవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో రెండవ రోజు న్యూ ప్లాట్స్ కాలనీ లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ న్యూ ప్లాట్స్ కాలనీ లో  స్తంభాలకు వీధిలైట్లు లేక చీకట్లో నివసిస్తున్నారని, దట్టమైన కంప చెట్లు మొలిచి విష సర్పాలు దళితుల ఇండ్లలోకి వస్తున్నాయని అన్నారు.

దళితులు చనిపోతే బొంద పెట్టడానికి స్మశాన స్థలం లేదని, రెండు ఎకరాలు స్మశానం కోసం కేటాయించాలని అన్నారు. తుంగభద్ర నది వద్ద ఉన్న స్మశాన స్థలానికి రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే సిసి రోడ్డు వేయాలని కోరారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 16న గురువారం రోజు అలంపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ దీక్షలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కేవీపీఎస్ నాయకులు మౌలాలి, నరసింహ, జయన్న, విశ్వం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -