Sunday, February 1, 2026
E-PAPER
Homeకవితదండకారణ్యం

దండకారణ్యం

- Advertisement -

ముఖచిత్రం ఆమె
పచ్చని చెట్లు, పుట్టలు
ఆమెకు తోబుట్టువులు
గలగల పారే వాగులు, వంకలు
ఆమెకు చుట్టాలు
కానీ
ఖనిజ సంపదంతా ఆమె
కాళ్ళ కింద ఉన్నా
ఆమె కాళ్ళకు చెప్పులు ఉండవు
బంగారు గనుల మధ్య ఆమె బతికినా
ఆమె మెడలో నల్లపూసల
దండలు ఉండవు
ప్రకతి అంతా ఆమెను ఆవహించినా
ఒళ్ళు దాచుకొను ఆమెకు
పాలిస్టర్‌ చీరలు ఉండవు
ఆమె గుర్తింపునకు కనీసం ఆధార్‌ కార్డులు ఉండవు
ఆమె గుర్తింపు భలే విచిత్రం
లో దుస్తులు వేసుకోకుంటే ఆదివాసి..
వేసుకుంటే నక్సలైట్‌..
ఇవి నా రాతలు కాదండోరు
రాజ్యపు నిద్దరణ ముద్రలు
ఇంతేనా..
సైనికుడి కామవంచకు బలైన బాధితురాలు ఆమె..
అన్నల కాపాడు కొనుటకు పక్కలో ఆలిగా మారిన చెల్లి ఆమె
నిత్యం గడపల్లో
ఎదురుచూస్తు ఉంటుంది
పాలిథిన్‌ కవర్‌లో
చుట్టివచ్చే బిడ్డల కోసం..
రోజుకొక చితిని పేర్చి ఉంచుతుంది
రాజ్యం తూటాలకు
నేలకొరిగిన వీరుల కోసం..
ఆమెది తీరని కడుపు కోత
మనలో ఎంతమందికి
తెలుసు ఆమె పోరాట చరిత్ర
నిత్యం రాజ్యంతో
పోరాడే వీరవనిత
రేపటి తరాలకు
వెలుగులు పంచే వేగుచుక్క (కాంతి రేఖ)
దండకారణ్యం
ముఖచిత్రం ఆమె..!
– అజయ్‌ కుమార్‌. ఏ, 8297630110

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -