Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రమాదకరంగా విద్యుత్ తీగలు..

ప్రమాదకరంగా విద్యుత్ తీగలు..

- Advertisement -

ట్రాన్స్ఫార్మర్ చుట్టూ తీగజాతి మొక్కలు 
నవతెలంగాణ – ఆర్మూర్ 

మున్సిపల్ పరిధిలోని  మామిడిపల్లి సరస్వతి నగర్ యందు కల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ తీగజాతి మొక్కలు అల్లుకొని ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆదివారం తెలిపారు. దీంతోపాటు హై టెన్షన్ విద్యుత్  విద్యుత్తు తీగల పైకి చెట్ల కొమ్మలు పెరిగినవి. ఈదురు గాలులు విచినప్పుడు విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి రాపిడి జరిపి నిప్పురవ్వలు చెలరేగుతాయని స్థానికులు వాపోతున్నారు. గత కొన్ని నెలల క్రితం ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద ఒక వ్యక్తి తన ఇంటి సమీపంలో ట్రాక్టర్కు వెల్డింగ్ చేసుకున్న తర్వాత 33 కెవి విద్యుత్ వైరు తగలడంతో గాయాల పాలయ్యాడు. గత జూన్ 24 న ఆలూరు మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాల పక్కన నుంచి వెళ్తున్న తీగల ద్వారా ఓ విద్యార్థి బంతి కోసం వెళ్లి విద్యుత్ షాక్కు గురై గాయపడ్డాడు.

అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చూడాలని,  విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు అల్లుకున్న తీగ మొక్కలను తొలగించాలని కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad