- Advertisement -
ఆ రాతిరి,
నిస్సహాయత
అతడి హృదయాన్ని తగలబెట్టింది
కమురు వాసనల మధ్య
అతడి ఓ కల
కాగడాల కోసం వేచి
బూడిదై రాలిన చీకటి దృశ్యం
ఆశలు
భవిష్యత్ బలహీనతలు
ఆ అసహాయుని దేహం మీదుగా మరో సూర్యోదయం
అతడు మరణించ బట్టి ఇది 101 సారి
పి. సుష్మ
- Advertisement -



