Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలను పరామర్శించిన డిబిఎఫ్ నాయకులు

బాధిత కుటుంబాలను పరామర్శించిన డిబిఎఫ్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ- దౌల్తాబాద్ : దౌల్తాబాద్ తాజీ మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్ , గొడుగుపల్లి తాజా మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి కుటుంబాలను పరామర్శించడం జరిగిందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో తాజా మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి తండ్రి, సూరంపల్లి గ్రామంలో తాజా మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ అత్తమ్మ ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకొని వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూరంపల్లి గ్రామానికి చెందిన దౌల్తాబాద్ మండల తాజా మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ అత్తమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించారు.

అలాగే గొడుగుపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి తండ్రి మద్దెల పోచయ్య అనారోగ్యంతో బాధపతుడు ఇటీవల మరణించారు. ఇట్టి విషయం తెలుసుకొని వారి కుటుంబాలను పరామర్శించడం జరిగిందన్నారు. ఇద్దరు మృతి చెందడం బాధాకరమని, వారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అధైర్యపడవద్దని మనోధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు ఇమ్మానుయేల్ , గజ్వేల్ రామచంద్రం, రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు, సామాజిక కార్యకర్త నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -