- Advertisement -
డిసిసిబి డైరెక్టర్ కోడి సుష్మ
నవతెలంగాణ – చండూరు
నల్లగొండ జిల్లా సహకార బ్యాంకు చండూరులో సహకార కుబేర డిపాజిట్ స్కీమ్ (స్పెషల్ డిపాజిట్ స్కీమ్) గురువారం ఆ సంఘం డిసిసిబి డైరెక్టర్ కోడి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ అనుముల భరత్ కుమర్ మాట్లాడుతూ బ్యాంకు యొక్క వివిధ రకాలైన రుణాలతో పాటు డిపాజిట్ సేకరణ కూడా ముఖ్యమని తెలిపారు. ఈ డిపాజిట్ సేకరణ మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోడి వెంకన్న, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
- Advertisement -