- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
సహాకార శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు మంగళవారం స్థానికి డీసీసీబీ బ్రాంచ్ ను సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన హాజరైనట్టు తెలిసింది. అనంతరం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము అశ్వారావుపేట ను సందర్శించిన ఆయన పాక్స్ కార్యాలయం ప్రాంగణంలో మామిడి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ మరియు మానిటరింగ్ ఆఫీసర్ ఏ. రాజశేఖర రెడ్డి,డీసీసీబీ స్థానిక బ్రాంచ్ మేనేజర్ అనూష, సీనియర్ ఇన్స్పెక్టర్ సోమయ్య, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



