Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమోడల్‌ స్కూల్స్‌ దరఖాస్తులకు ఫిబ్రవరి 28 వరకు గడువు

మోడల్‌ స్కూల్స్‌ దరఖాస్తులకు ఫిబ్రవరి 28 వరకు గడువు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మోడల్‌ స్కూల్స్‌లో 2026-27 విద్యాసంవత్సరానికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 194 మోడల్‌ స్కూల్స్‌ ఉండగా ఇందులో ఒక్కో స్కూల్‌లో 6వ తరగతిలో వంద మంది చొప్పున విద్యార్థులను తీసుకుంటున్నారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్‌ 19న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు (6వ తరగతికి), మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) నిర్వహించనున్నారు.

దరఖాస్తు రుసుం రూ.200 (ఒసీలకు), రూ.125 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్‌)గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు షషష.్‌స్త్రఎర.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅలో చూడొచ్చు. ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేయగా 11,766 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6వ తరగతి కోసం 7,821 మంది, 7వ తరగతి కోసం 1,604 మంది, 8వ తరగతి కోసం 1,370 మంది, 9వ తరగతి కోసం 790 మంది, 10వ తరగతి కోసం 181 మంది ఉన్నారు. మరో 598 మంది దరఖాస్తు రుసుం చెల్లించారు. కానీ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 194 మోడల్‌ స్కూల్స్‌ ఇంగ్లీష్‌ మీడియంలో ఉచిత విద్యను అందిస్తున్నాయి. వంద మంది బాలికల వరకు హాస్టల్‌ వసతిని అందిస్తున్నారు. ప్రతి తరగతిలో రెండు సెక్షన్లుగా 50 మంది విద్యార్థుల చొప్పున ఉంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -