Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దత్తప్రసాద్ బస్టాండులో వర్ధంతి, అన్నదానం

దత్తప్రసాద్ బస్టాండులో వర్ధంతి, అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన స్వరూప శ్రీనివాస్ ఉష్కల్వార్ దంపతుల కుమారుడైన దత్త ప్రసాద్ కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం తండ్రి మద్నూర్ పాత బస్టాండ్ సమీపంలో లక్షలు వెచ్చించి నూతన బస్టాండును నిర్మించారు. ఈ బస్టాండ్ నిర్మించి దాదాపు ఏడు సంవత్సరాలవుతోంది. ప్రతి సంవత్సరం ప్రయాణికుల కోసం నిర్మించిన బస్టాండులో కుమారుడి వర్ధంతిని ఆ దంపతులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సోమవారం బస్టాండ్ ఆవరణలో కుమారుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులు ఉషా సంతోష్ మేస్త్రి, ఉపసర్పంచ్ వట్నాల రమేష్, సరూప శ్రీనివాస్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పాల్గొని వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -