Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమేఘ విస్ఫోటంలో 70కి చేరిన మృతులు

మేఘ విస్ఫోటంలో 70కి చేరిన మృతులు

- Advertisement -

– శిథిలాల కింద 500 మందికి పైనే : మాజీ సీఎం ఫారూక్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌ :
జమ్మూకాశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌లో మేఘ విస్ఫోటం (క్లౌడ్‌ బరస్ట్‌) విలయం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరదలతో 70 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 500 మందికి పైగా గల్లంతైనట్టు అధికార నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫారూక్‌ అబ్దుల్లా వెల్లడించారు.
”కిశ్త్‌వాడ్‌లో చోటుచేసుకున్న క్లౌడ్‌ బరస్ట్‌లో 500 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్టు భావిస్తున్నా. కొందరు అధికారులు ఈ సంఖ్య 1000 దాటొచ్చని చెబుతున్నారు. ఇది తీవ్ర విషాదకరమైన క్షణం” అని అన్నారు. గతేడాది అక్టోబర్‌లో జమ్మూకాశ్మీర్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఒమర్‌ అబ్దుల్లా ప్రసంగించారు. ఈ విపత్తులో ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad