- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ గెయిల్ ఇండియా తదుపరి నూతన చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీి)గా దీపక్ గుప్తా నియమితులయ్యారు. ఈ మహారత్న కంపెనీలో ప్రస్తుతం ఆయన డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) బాధ్యతలను చూస్తున్నారు. గెయిల్ నూతన సీఎండీ కోసం డజన్ మంది అభ్యర్థులను ఇంటర్యూ చేసిన పబ్లిక్ ఎంటర్‌ప్రైస్ సెలెక్షన్ బోర్డు తుదకు దీపక్ గుప్తాను ఎంపిక చేసింది. గుప్తా ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు.. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో ఆయనకు 35 ఏండ్ల విశేష అనుభవం ఉంది.
- Advertisement -



