Friday, July 11, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం..

హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: మన దేశంలో జంక మాసం నిషేధం. అమ్మకూడదు.. తినకూడదు. ఇదీ జాతీయ రూల్. అలాంటిది ఇప్పుడు జింక మాంసం చాలా ఈజీగా దొరుకుతుంది. జింకను వేటాడకూదని అవగాహన కల్పించినా యదేచ్ఛగా చంపుతున్నారు. అనంతరం అమ్ముకుంటున్నారు. డబ్బుల కోసం అడవి జంతువును వేటాడుతున్నారు. ఈ ఘటనలో హైదరాబాద్ నడిబొడ్డులో జరిగింది. టోలిచౌకికి చెందిన సిరాజ్, వసీమ్ చార్మినార్ చౌక్ వద్దకు వెళ్లారు. ఓ వ్యక్తి వద్ద జింక మాసం కొనుగోలు చేశారు. దీంతో ఈ సమాచారం పోలీసులకు అందించారు. రంగంలోకి దిగిన టీమ్.. సిరాజ్, వసీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ‘ఎవరి వద్ద కొనుగోలు చేశారు. జింకను ఎక్కడ పట్టుకొచ్చారు.’ అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే జింకమాసం విక్రయం వెనుక పెద్ద నెట్ వర్కే ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఈ దందా జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ దందా వెనక ఎవరున్నారో కనిపెట్టి మిగిలిన జింకల ప్రాణాలను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -