- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెహదీపట్నం సమీపంలోని టోలిచౌకి–మెహదీపట్నం రోడ్డుపై అదుపు తప్పిన టూవీలర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జెప్టో డెలివరీ బాయ్ అభిషేక్ (25) కిందపడగా, అతనిపై నుంచి ట్రావెల్ బస్సు వెళ్లింది. తీవ్ర గాయాల కారణంగా అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మెహదీపట్నం పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



