నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బీచ్ మొహల్ల లో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారిచేత విద్యార్ధులకు రాగి జావ పునః పంపిణీ ప్రారంభ కార్యక్రమాన్ని డీఈవో కే సత్యనారాయణ ప్రారంభించినట్లు ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి తెలిపారు.
విద్యార్థులకు స్టీల్ గ్లాసుల పంపిణీ…
రాగి జావా తాగడానికి జిల్లా కేంద్రంలోని డాక్టర్ లక్ష్మీనారాయణ కస్తూరి హాస్పిటల్ పేరు మీద ఉచితంగా స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు. సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ .. రాగి జావా ఎంతో పోషక విలువలు ఉన్నటువంటి బెల్లంతో కలిపి ఇస్తున్నారని, ఇది ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము, అన్నపూర్ణ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారని, విద్యార్థులు రాగిజావ సేవించాలని కోరారు. డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు తీసిపోకుండా మంచి ఉపాధ్యాయుల బోధిస్తున్నారని కాబట్టి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి రాగి జావా తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. అనంతరం వంట కార్మికురాలు లక్ష్మిని డిఈఓ సత్యనారాయణ సన్మానించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోఆర్డినేటర్ ధనుంజయ, కస్తూరి హాస్పిటల్ అధిపతి డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ లు పాల్గొన్నారు.