12 పైసలు క్షీణించి రూ.88.14కు
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం అనిశ్చితికి తోడు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు తరలిపోవడం రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురి చేసింది. ఈ పరిణామాలతో గురువారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 12 పైసలు క్షీణించి 88.14కు దిగజారింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజీలో డాలర్‌తో రూపాయి విలువ 88.09 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 87.85-88.19 మధ్య ట్రేడింగ్ అయ్యింది. ముడి చమురు బ్యారెల్ ధర 1.07 శాతం తగ్గి 66.88 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ల నుంచి ఇటీవల నిరంతరం విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిధుల ఉపసంహరణ, వాణిజ్య సుంకాలపై అనిశ్చితి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్టు విదేశీ మారక ద్రవ్య ట్రేడర్లు తెలిపారు.
తగ్గిన రూపాయి విలువ
- Advertisement -
- Advertisement -