Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

- Advertisement -

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 
నవతెలంగాణ – భూపాలపల్లి
: ఈనెల 17న భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు  బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు.  ఆదివారం  భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈ నెల 17న ఉదయం 10 గంటలకు నియోజకవర్గంలోని కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామ శివారులో రూ.2కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం మంజూరునగర్ 8 ఇంక్లైన్ రోడ్డులో చర్చి ఎదురుగా ఉన్న మైదానంలో భూపాలపల్లి, గణపురం మండలం  ధర్మరావుపేట, చిట్యాల మండలం నవాబుపేట గ్రామాలల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ మొత్తం 3

విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని జెన్కో లో సింగరేణి, జెన్కో అధికారులతో వేరువేరుగా నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

మోరాంచ పల్లి నుండి బైక్ ర్యాలీ 

ఈనెల 17న భూపాలపల్లి నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామం నుండి మంజూర్ నగర్ లోని సభావేదిక వరకు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీ ఉంటుందని, ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  కోరారు.

 సభాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే..

ఈనెల 17న మంజూరునగర్ లో జరిగే సభా ప్రాంగాణాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సింగరేణి, జెన్కో, పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, విద్యుత్ శాఖ డి ఈ పాపిరెడ్డి, సీఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తి,కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, ఆర్టిఏ మెంబర్ సుంకరి రామచంద్రయ్య, ఎన్ఎస్ఆర్ అధినేత నాయినేని సంపత్ రావు, జిల్లా నాయకులు అప్పం కిషన్, మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్ , శిరుప అనిల్, కాంగ్రెస్ నాయకులు తోట రంజిత్, రజనీకాంత్ , వెంకన్న, రవీందర్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad