- Advertisement -
మహేష్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. ఆమె పోషిస్తున మందాకిని పాత్ర పోస్టర్‌ను బుధవారం మేకర్స్ రిలీజ్ చేశారు. చీరకట్టులో గన్ పేలుస్తూ కంప్లీట్ యాక్షన్ మోడ్‌లో ఉన్న ప్రియాంక అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తోంది. ‘ప్రపంచ వేదికపై ఇండియన్ సినిమాను పునర్నిర్వచించిన మహిళ. దేశీగర్ల్ మళ్ళీ వచ్చేసింది. ‘మందాకిని’ భిన్న పార్మ్శాలను చూడటానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది’ అని రాజమౌళి ఎక్స్‌వేదికగా పోస్ట్ పెట్టారు.
- Advertisement -



