నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లాలో ఆత్మకూర్ గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా ఎంపికైన సందర్భంగా గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ హనుమకొండ డిసిసి అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి లతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి లబ్దిదారుల ఇంటి మీద ఏర్పాటు చేసిన సోలార్ పానెల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని నమూనా సౌర గ్రామం కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలను ఇంధన స్వయం సమృద్ధి, నెట్-జీరో దిశగా మార్చడానికి రూపొందించిన ఒక వినూత్న కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి దీని పరిధిని, నిధులను మంజూరు చేసింది. గ్రామాలను సౌరశక్తి ద్వారా స్వయం సమృద్ధి గల శక్తి కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని నమూనా సౌర గ్రామం కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలను ఇంధన స్వయంసమృద్ధి నెట్-జీరో దిశగా మార్చడానికి రూపొందించిన ఒక వినూత్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో బాగంగా హన్మకొండ జిల్లాలోని ఆత్మకూర్ గ్రామం నమూనా సౌర గ్రామంగా ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు.ఈ ప్రాజెక్టును టీజీరెడ్కో (తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ) ద్వారా అమలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ విలేజ్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భాగంగా ఆత్మకూర్ ఎంపికైందని ఎమ్మెల్యే రేవూరి తెలిపారు. ఈ గ్రామంలో 1,825 నివాస విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. మొదటి విడతలో 1171 గృహజ్యోతి సర్వీసులకు ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల సోలార్ యూనిట్ ల ఏర్పాటు, 468 వ్యవసాయ పంప్‌సెట్‌లకు 7.5 కిలోవాట్ల సోలార్ యూనిట్లను అమరుస్తారని తెలిపారు. దీనికి అయ్యే సుమారు ₹48.35 కోట్ల వ్యయాన్ని (ఎంఎన్ఆర్ఈ) సబ్సిడీ పోను) రాష్ట్ర ప్రభుత్వమే భరించి, ఉచితంగా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ గ్రామంలోని గృహాలు, ప్రభుత్వ భవనాలు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఛార్జీల భారం తగ్గడమే కాకుండా, మిగులు విద్యుత్తును అమ్మి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఎంపిక చేసిన ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల (KW) సామర్థ్యం గల సోలార్ యూనిట్‌ను అందించి గృహ అవసరాలకు మించి ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను నెట్ మీటర్ల ద్వారా తిరిగి గ్రిడ్‌కు పంపుతారు, దీని ద్వారా నివాస వినియోగదారులు అదనపు ఆదాయాన్ని పొందుతారని తెలిపారు. గ్రామంలోని 468 వ్యవసాయ పంపు సెట్లకు కూడా సౌర విద్యుత్ సౌకర్యం కల్పిస్తారని, ప్రతి పంపు సెట్‌కు 7.5 కిలోవాట్ల (KW) సోలార్ యూనిట్‌ను అమర్చుతారు. వ్యవసాయ అవసరాలకు మించి ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను నెట్ మీటర్ల ద్వారా గ్రిడ్‌కు పంపడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. నివాస గృహాలకు వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ యూనిట్లను పూర్తిగా ఉచితంగా అందిస్తారని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కమలాపురం రమేష్, కాంగ్రెస్ సేవా దల్ అధ్యక్షులు ఏరుకొండ రవీందర్, మండల సమన్వయ కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, కక్కెర్ల రాజు, మండల నాయకులు పరికరాల వాసు, వార్డు సభ్యులు తనుగుల సందీప్ తాశీల్దార్ జగన్మోహన్ రెడ్డి ,ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



