Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో జరగాలి

అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో జరగాలి

- Advertisement -

– రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ డాక్టర్‌ వి.బాలకిష్టారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గు చూపుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ డాక్టర్‌ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. అన్ని దేశాలు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏకకాలంలో జరిగేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వేదికగా గురు, శుక్ర రెండు రోజులు పాటు జరిగిన ‘ఉద్యాన రంగంపై పర్యావరణ మార్పులు ‘అనే జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 20, 30 ఏండ్లపాటు కచ్చితంగా పర్యావరణ మార్పుల ప్రభావం ఉండనుందనీ, అందుకనుగుణంగా పర్యావరణ నాణ్యతను కాపాడుకోవాలన్నారు. ఎర్త్‌ సమ్మిట్‌, ఈఎన్‌ఎఫ్సీసీ, యూఎన్‌ఈపీ తదితర చట్టాలకు అనుగుణంగా దేశంలో ఉన్న 42 రకాల నియమాలకు అనుగుణంగా అందరూ ప్రవర్తించాలని కోరారు. పర్యావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయనీ, అయితే వాటిని తట్టుకునే దీటైన కార్యక్రమాలను స్థానికంగానే చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందరూ కలిసికట్టుగా ఈ కర్తవ్యానికి ముందుకు సాగాలని కోరారు. దేశంలోని ప్రతి పంటకు పర్యావరణ మార్పులు వాటి ప్రభావాన్ని తట్టుకునే అంశాలు, అలాగే వాతావరణ ఆధారిత ఉద్యాన, వ్యవసాయ సలహాలను రైతులందరికీ చేర్చేలా విస్తరణ సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని ఉద్యాన వర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ దండా రాజిరెడ్డి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -