మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని పలు గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలోభాగంగా వడ్లం,కాసులబాద్,బేగంపూర్ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్లం, బేగంపూర్ లో కాంగ్రెస్, బిజెపి నాయకులు బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
వీరికి మాజీ ఎమ్మెల్యే పార్టీ ఖండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ తరపున బలపర్చిన సర్పంచ్, వార్డుమెంబర్ లను గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోని వచ్చిందని దుయ్యబట్టారు.ఇచ్చిన హామీలను నెరవేర్చెకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దవా చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లాక్ష్మికాంత్ రావు కాంగ్రేస్ పార్టీ అభ్యర్థులను గెలించుకుంటే మీ గ్రామంలో అభివృద్ధి జరగదని చెప్పడం బెదరింపులకు పాల్పడటం సరైన పద్ధతి కాదని ఇది నారాయణ్ ఖేడ్ కాదు ఇది జుక్కల్ నియోజకవర్గమని ఆయన ప్రశ్నించారు.
మీ బెదరింపులకు పాల్పడితే ఇక్కడ భయపడే వారు ఇవ్వరులేరని పేర్కొన్నారు. ఆబెదరింపులెందో ఎన్నికలో ఇచ్చిన హామీలను అమలు చేసి చుయించలని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సతీష్, సంజీవ్ పటేల్, బుసప్పా పటేల్, సుధీర్, నందు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



