Thursday, July 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.382.5 కోట్లతో జోగులాంబ దేవాలయాభివృద్ధి

రూ.382.5 కోట్లతో జోగులాంబ దేవాలయాభివృద్ధి

- Advertisement -

పనుల విషయంలో రాజీపడొద్దు : జోగులాంబ మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్షలో మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అలంపూర్‌ జోగులాంబ దేవాలయాన్ని రూ.382.5 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో జోగులాంబ ఆలయ మాస్టర్‌ ప్లాన్‌పై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అందులో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్‌ జి.చిన్నారెడ్డి, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ వెంకటరావు, తెలంగాణ ధార్మిక్‌ సలహాదారులు గోవింద హరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ… జోగులాంబ ఆలయాల అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడొద్దని సూచించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. కృష్ణ – తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో జోగులాంబ శక్తి పీఠం ఉందనీ, ఆ దేవాలయ ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించారు. దేవాలయాన్ని మూడు విడతల్లో రూ.382.5 కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -