- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మాదన్ హిప్పర్గా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని నూతన సర్పంచ్ బాచావార్ లక్ష్మణ్ అన్ని హంగులతో రూపుదిద్దుతున్నారు. కార్యాలయం చుట్టూ కాంపౌండ్ వాల్, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. కార్యాలయం ముందు పెద్ద గేటు ఏర్పాటు చేశారు. దీంతో కార్యాలయం చూపరులకు ఆకర్షనీయంగా కనిపిస్తోంది. పాలకవర్గం ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయాన్ని ఒక మోడల్ కార్యాలయంగా అభివృద్ధి చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు. దీంతో గ్రామస్థులు సర్పంచ్ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



