Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లాలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
జిల్లాలో పలు సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ యస్ ఇ , ఈ ఈ,డి ఈ, ఏ ఈ,ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ విభాగం అధికారులతో అన్ని రకాల అభివృద్ధి పనుల ప్రగతిపై  అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ జిల్లాలో మంజూరైన పనుల గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయని , ఏ మేరకు నిధులు ఖర్చు చేశారని , ఎక్కడెక్కడ సదుపాయాల పునరుద్ధరణ జరిగింది తదితర వివరాలను ఆరా తీశారు.

కలెక్టరేట్ లో నిర్మాణం లో ఉన్న శ్రీ శక్తి భవనం నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.మహిళా దినోత్సవం రోజు  ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని అందుకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలన్నారు .వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టిన నేపద్యంలో నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లతో ఒప్పందం ఉన్నప్పటికీ, పనులను ఎందుకు కావడం లేదని నిలదీశారు. అభివృద్ధి పనులు నిర్ణీత గడువు లోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని,ప్రజల సౌకర్యాల కల్పన విషయంలో ఎంత మాత్రం రాజీ పడకూడదని,  జాప్యానికి తావు లేకుండా ఆయా విభాగాల వారీగా పనులను విభజించుకుని, ఏకకాలంలో జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గడువు లోపు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు.

ఏ చిన్న పని కూడా పెండింగ్ లో ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తదుపరి సమీక్ష జరిపే సమయానికి అన్ని పనులు ప్రారంభమై, స్పష్టమైన పురోగతి కనిపించాలని అన్నారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, జడ్పీ సి ఈ ఓ శోభారాణి, జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి నాగిరెడ్డి,సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -