నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాలుగు దాబా హోటళ్ల నిర్వాహకులను ముగ్గురు వ్యక్తులను బుధవారం జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో బైండోవర్ చేయడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై నవీన్ చంద్ర మాట్లాడుతూ.. మండలంలోని దాబా హోటల్ నిర్వహించే నిర్వాహకులు కచ్చితంగా చట్టబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. దాబా హోటల్లో మద్యం విక్రయాలు చేయవద్దని, సిట్టింగులు నిర్వహించరాదని ప్రత్యేకంగా వారికి అవగాహన కల్పించినప్పటికి వారిలో ఇంకా మార్పు రావడానికి మూడు దాబా హోటల్లో యజమానులపై జుక్కల్ తహసిల్దార్ మారుతి ముందు బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్ష రూలు అవుతారని, అటువంటి వారి పైన చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
దాబా నిర్వాహకులు తహశీల్దార్ ముందు బైండోవర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



